Monday, May 13, 2013

జాయింట్ డైరెక్టర్ లక్ష్మి నారాయణ స్పీచ్

        జాయింట్ డైరెక్టర్ V.V లక్ష్మి నారాయణ గారు విధి నిర్వహణలో సమర్థులే కాదు వాక్పటిమ గలవారు కూడా అని IMPACT 2013 కార్యక్రమంలో వారి ప్రసంగం చూస్తే అర్థమౌతుంది. భాష లో స్పష్టత , భావం లో వైశిష్ట్యత అలాగే తెలుగు భాష మీద వారికున్న మక్కువ ప్రస్పుటంగా కనిపిస్తాయి. విద్యార్థులకే కాదు ఎ రంగంలోనివారినైనా ఉత్తేజ పరిచేవిధంగా మాబాగా చెప్పారు.



ప్రసంగం లోంచి మచ్చుకి కొన్ని :

1. తనను తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడు
    పరులను తెలుసుకున్నవాడు పరమగ్నుడు
    అంతు తెలియదన్నవాడు ఆత్మగ్నుడు
    అన్నీ తెలుసనుకున్నవాడు అల్పగ్నుడు

2.  మంచి గుమ్మడి కన్నా దంచిన యెఱ్ఱని
     క్రొవ్వడ బియ్యపు కూడు కన్నా
     మేల్ జహంగీరు మామిడి పండు కన్నా
     సుజ కారిన లేసజ్జ కంకి కన్నా
     కమియ పండిన ద్రాక్ష కన్నా, చక్కెర తగ
     బోసి వండిన పాల బువ్వ కన్నా
     రసదాడి కన్నా, పనస తొన కన్నా
     ఖజూరపు కన్నను జూన్ను కన్నను
     అలతి పెరతేనియల కన్నను ఆమని తఱి
     కొసరి కూసిడి కోయిల కూత కన్నను
     ముద్దులొలికెడు జవరాలి మోవి కన్నా
     తియ్యనైనదెదయ్య అంటే అదే తెలుగు భాష
                                                  - ముదిగొండ వీరభద్రమూర్తి

3.  ప్రపంచానికి సంస్కారాన్ని సంస్కృతిని , భారతదేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పిన మహానుభావుడు  

    వివేకానంద. సమాజానికి అలాంటి వివేకానందుల అవసరముంది కాబట్టి ప్రతి సంవత్సరం ఒక 30 
    మంది వివేకానందులను తయారుచేయడం నా జీవితాశయం అని చెప్పారు.

4. దేహముంది ప్రాణముంది నెత్తురుంది సత్తువుంది ఇంతకంటే సైన్యముండునా..!!
                                                                                                 -సిరివెన్నెల