Showing posts with label శివ. Show all posts
Showing posts with label శివ. Show all posts

Thursday, March 7, 2013

శివ మానస పూజ

శ్రీ ఆదిశంకరాచార్యులవారు భాష్యాలు, వేదాంత వివరణలతో పాటు అనేక స్తోత్రాలు రచించారు. వాటిలో శివ మానస పూజా స్తోత్రం ప్రత్యేకమైనది. వేదాంత తత్వాన్ని  ఔపోసన పట్టి వాటి సారాన్నంతా ఐదు శ్లోకాలలో చెప్పడం శంకర భాగవత్పాదులవారికే  చెల్లింది. ఏ భౌతిక సాధనాలు లేకుండా కేవలం మానసికంగానే ఎంత  గొప్పగా దేవతారాధన చేయవచ్చో శివ మానస పూజా స్తోత్రం ద్వారా చెప్పారు.
 

స్తోత్రం:


రత్నైః కల్పితమాసనం హిమజలైః స్నానం చ దివ్యాంబరం
నానారత్న విభూషితం మృగమదా మోదాంకితం చందనమ్ |
జాతీ చంపక బిల్వపత్ర రచితం పుష్పం చ ధూపం తథా
దీపం దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతామ్ || 1 ||

సౌవర్ణే నవరత్నఖండ రచితే పాత్రే ఘృతం పాయసం
భక్ష్యం పంచవిధం పయోదధియుతం రంభాఫలం పానకమ్ |
శాకానామయుతం జలం రుచికరం కర్పూర ఖండోజ్జ్చలం
తాంబూలం మనసా మయా విరచితం భక్త్యా ప్రభో స్వీకురు || 2 ||

ఛత్రం చామరయోర్యుగం వ్యజనకం చాదర్శకం నిర్మలం
వీణా భేరి మృదంగ కాహలకలా గీతం చ నృత్యం తథా |
సాష్టాంగం ప్రణతిః స్తుతి-ర్బహువిధా-హ్యేతత్-సమస్తం మయా
సంకల్పేన సమర్పితం తవ విభో పూజాం గృహాణ ప్రభో || 3 ||

ఆత్మా త్వం గిరిజా మతిః సహచరాః ప్రాణాః శరీరం గృహం
పూజా తే విషయోపభోగ-రచనా నిద్రా సమాధిస్థితిః |
సంచారః పదయోః ప్రదక్షిణవిధిః స్తోత్రాణి సర్వా గిరో
యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనమ్ || 4 ||

కర చరణ కృతం వాక్కాయజం కర్మజం వా
శ్రవణ నయనజం వా మానసం వాపరాధమ్ |
విహితమవిహితం వా సర్వమేతత్-క్షమస్వ
జయ జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో || 5 ||





హరిహరపురం లోని శ్రీ ఆదిశంకరాచార్య శారద లక్ష్మి నరసింహ పీఠం, ప్రస్తుత మఠాధిపతులు శ్రీ స్వయంప్రకాశ సచ్చిదానంద సరస్వతి వారు స్తోత్రాలు చాలా స్పష్టంగా భక్తీ పారవశ్యంతో చదువుతారు. వారు ఆలపించిన శివ మానస పూజా స్తోత్రం ఇక్కడ పొందుపరుస్తున్నాను.